పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉండవని వాటిని వాడటానికి చాలామంది ఇబ్బంది పడుతుండడం సహజం. ‘ప్రజల్లో ఈ భావనను మార్చి తమ దగ్గరున్న పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉంటాయి’ అని తెలియచేయాలనుకుంది స్థానిక స్వచ్ఛంద సంస్థ నిపాన్ ఫౌండేషన్.
టోక్యోలో.. అద్దాల గదిలో టాయిలెట్లు..!
ఆఫీసు గదులూ షాపింగ్‌మాల్స్‌లాంటి వాటిని అద్దాలతో కడతారు. అయితే, టాయిలెట్లు అలా ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న ‘హారు నొ ఒగవా’ కమ్యూనిటీ పార్కులో ఈమధ్య కట్టిన పారదర్శక టాయిలెట్లు అందరికీ తెగ నచ్చేశాయి.
అందులోభాగంగానే ‘ద టోక్యో టాయిలెట్ ప్రాజెక్టు’ని ప్రారంభించి పేరుపొందిన పదహారు మంది ఆర్కిటెక్టులకు స్థానిక పార్కుల్లో ఉన్న టాయిలెట్లను కొత్తగా మార్చే బాధ్యతను అప్పగించింది. వీరిలో ఆర్కిటెక్ట్ ‘షిగెరు బాన్’ నిర్మించిందే ఈ అద్దాల టాయిలెట్. బయట నుంచి చూస్తే దీని లోపల ఎలా ఉందీ మొత్తం కనిపిస్తుంది. దాంతో శుభ్రంగా ఉందో లేదో తెలిసిపోతుంది. అయితే, ఒక్కసారి లోపలికెళ్లి తలుపు లాక్ చెయ్యగానే అద్దాలు పారదర్శకతను కోల్పోయి బయటివారికి ఏమీ కనిపించదు. కాబట్టి ఇబ్బంది ఉండదు. ఆలోచన బాగుంది కదూ..!