మన శరీరానికి ముఖ్యమైన కవచం చర్మం. చర్మం ఎల్లప్పుడు తేమగా ఉండటం చాలా అవసరం. మరి దీని కోసం ఏం చేయాలి...?
మాయిశ్చరైజర్లు వాడొచ్చు కానీ..!
మాయిశ్చరైజర్ల వల్ల చర్మానికి కాంతి వస్తుంది. పొడిబారడం, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలు తలెత్తవు. ఎండ పొడ పడనివాళ్లు నూనె ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ఇది మేకప్‌కు ప్రొటెక్టివ్ బేస్‌గానూ ఉపయోగపడుతుంది. అలాగని దీన్ని అతిగా వాడితే పులిపిరులు, మొటిమలు వచ్చే అవకాశం ఉంది.
నీళ్లు ముఖ్యం
చర్మం పొడిబారకుండా ఇవి చేయండి చర్మం తాజాగా ఉండాలంటే తేమ కావాలి. అందుగ్గానూ రోజంతా నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు చర్మాన్ని కాపాడటంతోపాటు, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. అందుకోసం తగినంత నీరు ప్రతీ రోజు తాగేట్టు చూసుకోవాలి. బయటకు వెళ్లొచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకుంటే పేరుకున్న రసాయనాలు, మురికి, మృతకణాలు పోతాయి.
నాచురల్‌గా...
చర్మం పొడిబారకుండా ఇవి చేయండి బయటకు వెళ్లినా లేకున్నా రోజూ రెండుసార్లు ముఖం కడుక్కోవడం మంచిది. తర్వాత పొడిచర్మమయితే ఆలివ్ నూనె రాయండి. జిడ్డు చర్మమయితే జెల్ వాడండి. సాధారణ లేదా పొడి చర్మానికి పెరుగులో కలిపిన కీరాదోస రసం, జిడ్డు చర్మానికి గుడ్డు తెల్లసొనలో చెంచా తేనె, నాలుగు చుక్కలు నిమ్మరసం కలిపి పెడుతుంటే తేటదనం వస్తుంది.
ఇదీ చూడండి:వెండితెర చిత్ర రాజం: భైరవద్వీపం సినిమా గురించి ఆసక్తికర విశేషాలు