తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

వృద్ధాప్యంలో నడుం వంగిపోకూడదంటే.. సి-విటమిన్ ఉండాల్సిందే!

వృద్ధాప్యంలో కొందరికి నడుం వంగిపోతుంటుంది.  ఎందుకంటే వాళ్లలో యాభై దాటాక వెన్నెముక కండరాల పరిమాణం ఏటా ఒక శాతం తగ్గిపోతుంటుంది. దాంతో వెన్నెముక కొంచెంకొంచెంగా వంగిపోతుంటుంది. ఈ స్థితినే సార్కొపెనియా అంటారు.

By

Published : Sep 6, 2020, 5:18 PM IST

sarcopenia can be cured with vitamin c
సి-విటమిన్‌ వంగిపోనివ్వదు!

యాభై ఏళ్లు దాటినవాళ్లు విటమిన్‌-సి ఎక్కువగా తీసుకుంటే నడుం వంగిపోయే పరిస్థితి తలెత్తే అవకాశం తక్కువ అంటున్నారు ఈస్ట్‌ ఆంగ్లియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఆ వయసులో సి-విటమిన్‌ ఎక్కువగా ఉండే పండ్లూ కూరగాయలూ బెర్రీలూ తినేవాళ్లలో వెన్నెముక కండరాలు కుంచించుకుపోకుండా ఉంటున్నాయట. హానికర ఫ్రీరాడికల్స్‌ కారణంగా కణజాలాలు దెబ్బతినకుండా కాపాడుతుంది సి-విటమిన్‌.

ఈ విషయాన్ని నిర్ధరించుకునేందుకు వీళ్లు 42- 82 మధ్య వయసులోని సుమారు 13 వేలమందిని ఎంపిక చేసి వాళ్లు తీసుకునే సి-విటమిన్‌ శాతాన్నీ వాళ్ల కండరాల పరిమాణాన్నీ పరిశీలించారు. అందులో సి-విటమిన్‌ ఎక్కువగా తీసుకునే వర్గంలో కండరాల పరిమాణంలో పెద్ద తేడా కనిపించలేదట. సో, పండ్లూ కూరగాయలూ తినేవాళ్లలో ఎముక కండరాల క్షీణత తక్కువగా ఉంటుందన్నమాట.

ABOUT THE AUTHOR

...view details