- రాత్రి పడుకునేముందు పాదాల పగుళ్లకు వెన్న లేదా వ్యాజిలిన్ రాస్తే మృదువుగా అవుతాయి. పక్కబట్టలకు అంటకుండా సాక్స్ లేదా పాత దుప్పటి వేసుకోవచ్చు.
- నానబెట్టి పొట్టు తీసిన బాదంపప్పు క్రమం తప్పక తింటే కాళ్లు పగలవు.
- కాళ్లను కొంచెం నాననిచ్చి స్క్రబ్బర్ లేదా ప్యూమైన్ స్టోన్‌తో రుద్దాలి. తరచూ ఇలా చేస్తే పగుళ్లు పోతాయి.
- తేనె మంచి యాంటీసెప్టిక్. తేనెలో నిమ్మరసం కలిపి పాదాలకు రాయడం వల్ల ఫలితం ఉంటుంది.
- రాత్రి కొబ్బరినూనెను రాసి ఉదయం రుద్ది కడగాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలు పగుళ్లను తగ్గిస్తాయి. ఆలివ్, నువ్వుల నూనెలు కూడా సత్ఫలితాలను ఇస్తాయి.
- పగిలిన పాదాలకు అరటిపండు గుజ్జు రాయాలి. ఇందులో ఉండే ఎ, బి6, సి విటమిన్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.
Health tip: |