ఫేస్బుక్లో వాట్సాప్ తరహా డిలీట్ ఆప్షన్
మెసెంజర్లో స్నేహితులకు పంపిన సందేశాన్ని డిలీట్ చేసుకునే సదుపాయం కల్పించింది ఫేస్బుక్. సంభాషణ జరిగిన 10 నిమిషాలలోపు మెసేజ్ తొలగించుకోవచ్చు.
మీరు ఫేస్బుక్ చాటింగ్ చేస్తారా? మెసెంజర్లో పంపిన సందేశాన్ని ఎప్పుడైనా తొలిగించారా? ఇప్పటివరకైతే వీలుపడదు. మన అకౌంట్లో డిలీట్ అవుతుంది. కానీ మన నుంచి సందేశం అందుకున్న వారి ఇన్‌బాక్స్‌లో అలానే ఉంటుంది. ఇప్పుడా సమస్య లేదు.. మెసెంజర్లో మీరు పంపిన సందేశాన్ని డిలీట్ చేసే సదుపాయం కల్పించింది ఫేస్బుక్..! అదేనండి మన వాట్సాప్‌లో మెసేజ్‌ని డిలీట్ చేసినట్లు సులభంగా తీసేయొచ్చు.
చాలా సార్లు పొరపాటున ఒకరికి పంపాల్సిన సందేశాన్ని మరొకరికి పంపిస్తుంటారు. తర్వాత పశ్చాత్తాపం చెందినా ఫలితం ఉండదు. ఇకపై ఫేస్బుక్ మెసెంజర్లో సందేశం పంపిన తర్వాత ఓ విండో ఒపెన్ అవుతుంది. అనంతరం ఆ సందేశాన్ని క్లిక్ చేసినపుడు 'రి మూవ్ ఫర్ ఎవ్రీ వన్' అనే ఆప్షన్ ద్వారా తొలగించవచ్చు. మెసేజ్ తీసేయడానికి 10 నిమిషాల సమయమిస్తుంది. ఈలోపు ఇష్టం లేకుంటే డిలీట్ చేయొచ్చు.
ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ కూడా ఈ సదుపాయం ద్వారా తను పంపిన సందేశాలను విజయవంతంగా డిలీట్ చేయగలిగారని సంస్థ తెలిపింది. అన్ని ఆండ్రాయిడ్, యాపిల్ మొబైల్స్‌లో ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌లోని ఫీచర్‌ని వినియోగించుకోవచ్చు.