తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నెల రోజుల్లోనే రెండో పెళ్లి.. భర్త ఇంటి ముందు భార్య ఆందోళన - bodhan latest news

పెళ్లై నెల రోజులు కాకముందే మరో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న మొదటి భార్య భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. బాధితురాలికి న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో చోటుచేసుకుంది.

SECOND MARRAIGE
SECOND MARRAIGE

By

Published : Jul 10, 2020, 6:12 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని ఇంటి ముందు బైఠాయించి భార్య ఆందోళన చేసింది. తన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. కారెవర్ శ్రీకాంత్‌కు మనీషాతో ఫిబ్రవరి 26న పెళ్లి జరిగింది. శ్రీకాంత్ హైదరాబాద్‌లో మెడికల్ షాప్‌లో పనిచేయగా అక్కడ మంచిర్యాలకు చెందిన వనజ అనే అమ్మాయి పరిచయం అయింది. మార్చి 20న యాదగిరిగుట్టలో ఆమెను రెండో పెళ్లి చేసున్నాడు.

లాక్‌డౌన్ ఉండటంతో మొదటి భార్య పుట్టింట్లో ఉండాల్సి వచ్చింది. రెండో పెళ్లి విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు భర్త ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి:కూల్చివేత ఎఫెక్ట్​: ఆలయం, మసీదు దెబ్బతినటంపై సీఎం ​విచారంఆమెను

ABOUT THE AUTHOR

...view details