తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. ఇద్రరు మృతి - నాగర్​ కర్నూల్​ జిల్లాలో రోడ్డు ప్రమాదం

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం గోడను ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

two people died in road accident in nagar Kurnool district
అదుపు తప్పిన ద్విచక్ర వాహనం.. ఇద్రరు మృతి

By

Published : Jan 13, 2021, 5:59 PM IST

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పురపాలక పరిధిలోని జేపీ నగర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెద్ద కొత్తపల్లి మండలం గండ్రావ్ పల్లి గ్రామానికి చెందిన వెంకటస్వామి (55), లక్ష్మి (23) మృతి చెందారు.

జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం గండ్రవ్ పల్లికి చెందిన వెంకట స్వామి హైదరాబాద్​లో నివాసం ఉంటున్న తన అన్న కూతురు లక్ష్మిని ద్విచక్ర వాహనం ఎక్కించుకుని అచ్చంపేట గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కల్వకుర్తి పురపాలక పరిధిలోని జేపీ నగర్ వద్ద గల ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. తీవ్రగాయాలతో లక్ష్మి ప్రమాద స్థలంలోనే మృతి చెందగా వెంకటస్వామిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చదవండి:ఆన్‌లైన్‌ చదువులపై.. నిపుణులు, వైద్యుల సూచనలు

ABOUT THE AUTHOR

...view details