భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం భీముని గుండం కొత్తూరు వద్ద ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు వేగంగా ఢీకొని పూర్తిగా కాలిపోయాయి. వాహనాలపై ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అశ్వాపురం మండలం వెంకటాపురం పంచాయతీ పరిధిలోని పాలవాగుకు చెందిన సందీప్ అనే యువకుడు బైక్పై అశ్వాపురం వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో బూర్గంపాడు మండలానికి చెందిన భూషణం అనే మరో యువకుడు బూర్గంపాడు వైపుగా వెళ్తున్నాడు. అతివేగంగా వస్తున్న రెండు వాహనాలు అదుపుతప్పి ఎదురెదురుగా ఢీకొన్నాయి.