డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన ఓ వ్యక్తి తాను తెరాస నేతనంటూ... తననే ఆపుతారా? అని వీరంగం చేశారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పోలీసులు రాంకోఠి కూడలి వద్ద స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కాచిగూడ వెళ్తున్న ఒక కారును ఆపగా... కారులో మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. హిమాయత్ నగర్‌కు చెందిన కే.పీ శ్రీకాంత్ మద్యం సేవించి కారు నడుపుతూ తన మిత్రుడితో కలిసి పట్టుబడ్డారని చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్చల్
డ్రంక్ డ్రైవ్‌లో పట్టబడిన ఓ వ్యక్తి తాను తెరాస నేతననీ... ఎందుకు ఆపుతున్నారంటూ హల్చల్ చేశారు. రాంకోఠి కూడలి వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కేపీ శ్రీకాంత్ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టబడ్డారు. ఓ 45 నిమిషాల పాటు సహకరించకుండా వీరంగం సృష్టించారని పోలీసులు తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్చల్
సముదాయిస్తున్నా వినకుండా 45 నిమిషాల పాటు హల్చల్ చేశారన్నారు. కేసు నమోదు చేసి... కారును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 11 కేసులు నమోదు చేయగా... వాటిలో 2 కార్లు 9 ద్విచక్రవాహనాలు ఉన్నట్లు వెల్లడించారు. కాన్సిలింగ్ అనంతరం కోర్టు ఎదుట హాజరు పరుస్తామని సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:పల్లె యువతపై వ్యసనాల పడగ