వివాహమై సంవత్సరం తిరగకముందే ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామానికి చెందిన మామిండ్ల మహేష్(25) గ్రామ శివారులో పొలంలో వరి పంట నూర్పిడి చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు.
విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడి మృతి - kamareddy crime updates
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో జరిగింది. ఈ మరణంతో ఇరు కుటుంబాలు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడి మృతి
మృతుడికి ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. మహేష్ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:ప్రేమపేరుతో దారుణం.. గుంటూరు జిల్లాలో యువతి హత్య..!