ఏపీలోని విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేరంగిలో కన్న తండ్రిని కుమారుడే హత్య చేశాడు. గ్రామానికి చెందిన చేబి పోతయ్య అనే వ్యక్తి అతనికున్న మూడు ఎకరాల పొలాన్ని తన ముగ్గురు కొడుకులకు సమానంగా ఇచ్చారు.
తండ్రిని చంపిన తనయుడు...ఆస్తి వివాదమే కారణం! - murder news
ఏపీలోని విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేరంగి గ్రామంలో కుమారుడే తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది.
తండ్రిని చంపిన తనయుడు...ఆస్తి వివాదమే కారణం!
ఈ పంపకాల విషయంలో రెండవ కుమారుడు తిరుపతిరావు, తండ్రికి మధ్య కొంత కాలంగా వివాదం నడుస్తోంది. శుక్రవారం రాత్రి తిరుపతిరావు మద్యం మత్తులో తండ్రిని కర్రతో కొట్టి చంపాడు.
ఇదీ చూడండి: ఉమ్మడి కుటుంబం ఇష్టంలేని ఆ ఇల్లాలు ఏం చేసిందంటే..