తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు స్వాధీనం - అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు స్వాధీనం

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను మంచిర్యాల జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి బాలు పట్టుకున్నారు. ఇసుకను తరలించి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని ఆయన తెలిపారు.

Seized 6 tractors moving sand illegally in manchirial district
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లు స్వాధీనం

By

Published : Aug 29, 2020, 2:48 PM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మంచిర్యాల జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి బాలు పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల రాళ్లవాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

కొన్ని రోజులుగా అనుమతులు లేకుండా గోదావరి, వాగుల నుంచి ఇసుకను తరలించి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీలు కట్టకుండా రవాణా చేస్తున్నారని జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి బాలు వెల్లడించారు.

ఇవీ చూడండి: కరీంనగర్‌ ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలోని స్టోర్‌లో మంటలు

ABOUT THE AUTHOR

...view details