తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2020, 10:05 AM IST

ETV Bharat / jagte-raho

100 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్టు

అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిను ఏపీలోని విశాఖ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Seizure of 100 kg of cannabis in Visakhapatnam
విశాఖలో 100 కిలోల గంజాయి పట్టివేత

ఏపీలోని విశాఖ మన్యం నుంచి అక్రమంగా మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా రోలుగుంట పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్​కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

రోలుగుంట పోలీసులు ఎం కె పట్నం శివారు పెద్దపేట వద్ద వాహన తనిఖీ చేస్తుండగా.... ఈ గంజాయి పట్టుబడింది. దీంతో పాటు ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్​తో ఉన్న బొలెరో వాహనాన్ని, రెండు చరవాణీలను, మూడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details