తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వంద రూపాయల కాగితం.. తీసింది ఇల్లాలి ప్రాణం!

'రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే. తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీబిడ్డల మధ్య చిచ్చుబెడతాను. చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటోందట.' ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. వంద రూపాయలు.. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి.. పసి పిల్లలను అనాథలను చేసింది.

gunturu suicide

By

Published : Oct 14, 2019, 5:39 PM IST

పైసా.. తలచుకుంటే ఏదైనా సాధ్యమే. ప్రాణాలు పోవడానికైనా..నిలపడానికైనా.. బంధాలు.. బంధుత్వాలు.. తెగిపోవడానికైనా. గుంటూరులో అదే జరిగింది వంద రూపాయలు తెచ్చిన తంటా ఏకంగా ప్రాణాలు పొగొట్టింది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది.

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన రాజాసాహెబ్, సైదాబీ.. ఆరు నెలల కిందట పని నిమిత్తం వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవించారు. వారి కుమార్తె నాగుల్​బీని గుంటూరుకు చెందిన బంధువు మస్తాన్​వలికి ఇచ్చి ఆరేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. రైతుబజార్​లో మస్తాన్​వలి కూలి పనులు చేస్తుంటాడు. ఈ నెల 12న కూలి డబ్బులు తెచ్చి భార్య నాగుల్​బీకి ఇచ్చాడు. కాసేపయ్యాక ఏదో పని ఉండి డబ్బులు తీశాడు. అందులో 100 రూపాయలు తక్కువగా ఉంది. డబ్బులు ఏం చేశావంటూ నిలదీయగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

తీవ్ర మనస్తాపానికి గురైన నాగుల్​బీ... ఆదివారం ఉదయం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. మస్తాన్​వలీ వెంటనే భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అత్తామామలకు ఫోన్​ చేసి చెప్పాడు. చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించిన కారణంగా.. నాగుల్​బీ మృతి చెందింది. మృతురాలి తల్లి సైదాబీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details