రాచకొండ కమిషనరేట్ పరిధిలో వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈనెల 17న వనస్థలిపురంలో పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లి... అబ్దుల్లాపూర్ మెట్‌లో ఏటీఎంలో దొంగతనం చేశారు. ఎటీఎంలో సీసీ కెమెరాలకు నల్లరంగు వేసి చోరీ తర్వాత డీవీఆర్‌ని ఎత్తుకెళ్లారని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. చోరీ తర్వాత పోలీసు వాహనాన్ని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో వదిలినట్లు పోలీసులు గుర్తించారు.
ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు - Rachakonda CP Mahesh Bhagwat
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వరుస ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా హరియాణాకు చెందినదిగా గుర్తించినట్లు సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బ్యాంకు యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు
ఈ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేసి వారివద్ద నుంచి 73 వేలు నగదు, గ్యాస్ కట్టర్లు, ఒక టాటాసుమోను స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని సీపీ వెల్లడించారు. ఈ ముఠా హరియాణాకు చెందినదిగా సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఈ చోరీల విషయంలో బ్యాంకు యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Last Updated : Dec 24, 2020, 4:34 PM IST