ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త - Jayashankar Bhupalapally District news

జీవితాంతం తోడుగా నిలవాల్సిన భర్త... ఆమె పాలిట యముడయ్యాడు. తాగుడికి బానిసై... క్షణికావేశంలో కట్టుకున్న భార్యనే... గొంతు నులిమి చంపేశాడో కర్కశ భర్త. ఈ ఘటన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని పోచంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

husband-killed-his-wife-in-jayashankar-bhupalapally-district
తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త
author img

By

Published : Dec 20, 2019, 1:05 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్త సదయ్య... తన భార్య లత(32)ను గొంతు నులిమి హతమార్చి... పారిపోయాడు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలికి చేరుకున్న భూపాలపల్లి డీఎస్పీ సంపత్​రావు, సీఐ సాయిరమణ, ఎస్సై కృష్ణప్రసాద్​, పోలీస్​ సిబ్బంది చేరుకుని విచారణ చేపట్టారు.

తాగుడుకు బానిసై.. నిత్యం భార్యాపిల్లల్ని కొట్టేవారని విచారణలో తేలింది. భార్యను చంపి పరారైన నిందితుడినిరేగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త

ఇవీ చూడండి : రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్​ట్రాక్​ కోర్టులు ఏర్పాటు

For All Latest Updates

TAGGED:

crime news

ABOUT THE AUTHOR

...view details