తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అత్యాచార ఘటనపై ఏపీ సీఎంకు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు లేఖ రాశారు. యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నా ఓ పాస్టర్​ను తిరుపతి అర్బన్ పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. నాగేశ్వరరావు చేసిన ఆరోపణలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్​ రెడ్డి ఖండించారు.

By

Published : Oct 15, 2020, 9:06 PM IST

అత్యాచార ఘటనపై ఏపీ సీఎంకు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ
అత్యాచార ఘటనపై ఏపీ సీఎంకు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ

ఏపీ తిరుపతి అర్బన్‌ జిల్లాలో ఈనెల 3న జరిగిన ఓ అత్యాచార ఘటనకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సీబీఐ మాజీ డైరక్టర్‌ ఎం.నాగేశ్వరరావు లేఖ రాశారు. ఓ పాస్టర్‌ తన వద్ద పని చేసే మహిళా ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడ్డారని... ఆ విషయంలో కేసు నమోదు చేయడానికి పోలీసులు 9 రోజులు ఆలస్యం చేశారని అందులో పేర్కొన్నారు. నిందితుడు స్థానికంగా మత మార్పిడుల వ్యాపారంలో పాలు పంచుకున్నాడని... రాజకీయ, ఇతర ఒత్తిడిలతో స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదని ఆరోపించారు.

మహిళలపై నేరాల విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జారీ చేసిన నిబంధనల ప్రకారం.. స్థానిక పోలీసులు వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఆ విధంగా జరగడం లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితుడిని అరెస్టు చేయాలని.. నిష్పాక్షితంగా వేగవంతమైన విచారణ చేపట్టాలని సీఎంను నాగేశ్వరరావు కోరారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 357 ప్రకారం భాదితురాలికి పరిహారం చెల్లించాలని కోరారు. ఈ మేరకు తాను ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆయన ట్విట్టర్‌ ద్వారా బయటపెట్టారు.

అత్యాచార ఘటనపై ఏపీ సీఎంకు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ

తిరుపతికి వచ్చి తెలుసుకోండి...

మరోవైపు సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు చేసిన ఆరోపణలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్​ రెడ్డి ఖండించారు. బాధితురాలి నుంచి ఈనెల 12న ఫిర్యాదు అందిందన్న ఎస్పీ... మూడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిని అరెస్టు చేశామన్నారు. బాధితురాలికి పరిహారం ఇవ్వాలని నాగేశ్వరరావు చేసిన డిమాండ్​ను స్వీకరిస్తూ తన నెల జీతం సగం ఇస్తున్నానన్న ఎస్పీ.... ఆయన ఎంత ఇస్తారో తెలియజేయాలన్నారు.

తనపై ఒత్తిడి ఉందో, లేదో తిరుపతికి వచ్చి నాగేశ్వరరావు తెలుసుకోవచ్చంటూ ఎస్పీ వ్యాఖ్యానించారు. ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తి ఐపీఎస్ అని ట్విట్టర్ ఖాతాలో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించిన ఎస్పీ.... అసలు ఆ ఖాతా ఆయనదో కాదో విచారణ చేయిస్తామన్నారు.

ఇదీ చదవండి

ఉద్యోగం పేరుతో యువతిపై అత్యాచారం... పాస్టర్ అరెస్టు

ABOUT THE AUTHOR

...view details