మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో దారుణం జరిగింది. అడవి పందుల కోసం రైతులు వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కొడుకు మరణించారు. తీగల విషయం తెలియక అటుగా వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
అడవి పంది కోసం వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కొడుకు మృతి
అడవి పందుల దాడి నుంచి పంటను కాపాడేందుకు వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కొడుకు బలైన ఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి తండాలో జరిగింది.
అడవి పంది కోసం వేసిన విద్యుత్ తీగలు తగిలి తండ్రీ కొడుకు మృతి
స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కృష్ణమూర్తి వివరించారు.
ఇదీ చదవండిఃఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన తల్లి