తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 1:12 PM IST

ETV Bharat / jagte-raho

స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతాను పంజాబ్​లో సృష్టించారు!

అదనపు డీజీ స్వాతి లక్రా పేరు మీద నకిలీ ఫేస్​బుక్​ ఖాతాను పంజాబ్​లో సృష్టించినట్లు సైబర్​ క్రైం పోలీసులు గుర్తించారు. నకిలీ ఫేస్​బుక్​ ఖాతాపై స్వాతి లక్రా ఫిర్యాదుతో సీసీఎస్​ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

fake facebook account on additional dg swathi lakra
అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతా.. !

అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్​ను పంజాబ్​లో సృష్టించారని ఐపీ అడ్రస్​ ఆధారంగా సైబర్​ క్రైం పోలీసులు తెలిపారు. పంజాబ్​ నుంచి సైబర్​ నేరగాళ్లు ఫేస్​బుక్​ ఖాతా సృష్టించుకుని స్వాతి లక్రా పేరుతో పలువురికి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపించారని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు వివరించారు.

పది రోజుల క్రితం అదనపు డీజీ స్వాతి లక్రా పేరుతో నకిలీ ఫేస్​బుక్​ ఖాతా సృష్టించినట్లు ఆమె దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె తన ఫేస్​బుక్​ ఖాతా ద్వారా సందేశాన్నిచ్చారు. వెంటనే ఇందుకు సంబంధించి.. సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు పంజాబ్​లో ఉన్నట్లు గుర్తించామని.. పోలీసులు ఓ బృందాన్ని పంపినట్లు తెలిపారు.

ఇదీ చదవండిఃపోలీసుల స్నేహితులే టార్గెట్.. నమ్మించి టోకరా వేస్తున్న కేటుగాళ్లు

ABOUT THE AUTHOR

...view details