మహబూబాబాద్ జిల్లా పెద్ద నాగారం స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొలెరో గూడ్స్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టటంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా మామిల్లగూడెంకు చెందిన మడిపల్లి శ్రీనివాస్, సౌడారపు శ్రీను అనే ఇద్దరు వ్యక్తులు వంట మేస్త్రిలుగా పని చేస్తుంటారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వంటలు చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన జరిగింది. దీంతో వీరిద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.