నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పముల సమీపంలో వాగులో పశువుల కాపలాకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. పశువుల కాపరులు బిచ్చారెడ్డి, రాజారెడ్డి కుంటిమడుగు ప్రాంతంలో పశువులు కొట్టుకుని పోతుండగా... కాపాడే ప్రయత్నంలో వాగులో గల్లంతయ్యారు.
వాగులో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం - etv bharat
గురువారం ఉదయం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పముల సమీపంలో వాగులో ఇద్దరు పశువుల కాపర్లు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి.
వాగులో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం
సమాచారం అందుకున్న గ్రామస్థులు, అధికారులు వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి వాగు దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఈరోజు తెల్లవారుజామున వాగులో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్లో ఎంపీ