తెలంగాణ

telangana

By

Published : Oct 2, 2020, 9:50 PM IST

ETV Bharat / jagte-raho

జనగాంలో వర్గపోరు.. పొన్నాల, జంగా వర్గాల తోపులాట..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ మధ్య వర్గ విభేదాలు పెద్దఎత్తున వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. జనగాం నియోజకవర్గంలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. శుక్రవారం నాడు జనగామలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, జంగా రాఘవరెడ్డి వర్గాల మధ్య తోపులాట జరిగింది.

cold-war-between-ponnala-versus-janga
పొన్నాల, జంగా వర్గాల మధ్య తోపులాట.. వాగ్వివాదం

జనగామ పట్టణంలోని‌ గాంధీ విగ్రహం వద్ద పొన్నాల లక్ష్మయ్య, జంగా రాఘవరెడ్డి వర్గాల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సమక్షంలోనే ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. రౌడియిజాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ... జంగా రాఘవరెడ్డితో పొన్నాల లక్ష్మయ్య వర్గీయులకు వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

జనగామ జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. దానిలో భాగంగా అక్కడికి చేరుకున్న ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. వెంటనే స్పందించిన పోలీసులు అడ్డుకొని సద్దుమణిగించారు.

ఇదీ చదవండి:గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ABOUT THE AUTHOR

...view details