తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 11:48 AM IST

ETV Bharat / jagte-raho

జడ్చర్ల సహకార బ్యాంకు అధికారులపై కేసు నమోదు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్లలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.50 లక్షల చెల్లింపులో జాప్యం జరుగుతోందని గమనించిన 160 మంది ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

case filed against Jadcherla cooperative bank officers in mahabubnagar district
జడ్చర్ల సహకార బ్యాంకు అధికారులపై కేసు నమోదు

మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఖాతాదారుల వద్ద సేకరించిన డిపాజిట్ నగదులో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జడ్చర్లలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్​లో కొన్ని సంవత్సరాలుగాా బ్యాంకు అధికారులు ప్రైవేట్ ఏజెంట్​ను పెట్టి ఖాతాదారుల వద్ద డిపాజిట్ డబ్బులు జమ చేశారు. దాదాపు రూ.50 లక్షల వరకు 160 మంది ఖాతాదారుల వద్ద నగదు జమ చేసి, వాటి కాలపరిమితి పూర్తైనా చెల్లింపులు చేయలేదు.

చెల్లింపుల్లో జాప్యం చేయడం వల్ల ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. డబ్బుల్లో అవకతవకలు జరిగాయని గుర్తించిన ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు సీఈఓ కుబేరుడు, మేనేజర్ ప్రభాకర్, ఏజెంట్ జహంగీర్​పై జడ్చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details