కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బీటీఎస్ వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఘటనలో బైక్పై ఉన్న వికాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
బైకును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు - kamareddy latest news
బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
బైకును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతి చెందిన వికాస్ భిక్కనూరుకు చెందిన వాడిగా గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.