సిద్దిపేటలో ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తుమ్మలోనిగూడెంకు చెందిన గంగుల శ్రీనివాస్ ఈనెల 1న ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట... కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఆత్మహత్యాయత్నం చేసిన భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి - భాజపా వార్తలు
ఈనెల ఒకటిన హైదరాబాద్ నాంపల్లిలో భాజపా కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన గంగుల శ్రీనివాస్ మృతి చెందాడు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
భాజపా కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతి
వెంటనే స్పందించిన పోలీసులు.. స్థానికుల సహకారంతో మంటలు ఆర్పి అతన్ని ఆస్పత్రికి తరలించారు. 40శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ మృతి చెందాడు. శ్రీనివాస్ మృతి పట్ల భాజపా నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:ఆ పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం కొనితెచ్చుకోవద్దు: బండి సంజయ్