భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఘట్కేసర్ వద్ద భువనగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌లో ఆదివారం తెరాస-భాజపా కార్యకర్తలు దాడులు చేసుకోగా.. గాయపడ్డ కమలం కార్యకర్తలను పరామర్శించేందుకు రాజాసింగ్ బయల్దేరారు.
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్ - ఎమ్మెల్యే రాజాసింగ్ వార్తలు
వరంగల్ దాడి ఘటనలో గాయపడ్డ భాజపా కార్యకర్తలను పరామర్శించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు రాజాసింగ్‌ను ఘట్కేసర్లో అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
raja singh
మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించిన పోలీసులు రాజాసింగ్‌ను ఘట్కేసర్లో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. గూడూరు టోల్‌ప్లాజా వద్ద నిఘాపెట్టారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే వరంగల్‌వైపు అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి :భాజపా కార్యాలయంపై తెరాస శ్రేణులు దాడి