హైదరాబాద్ నల్లకుంట శంకర్‌మఠ్ రహదారిపై ఇన్నోవా వాహనం పల్టీ కొట్టింది. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా టైర్ పేలిపోయింది. అదుపు తప్పిన వాహనం పక్కనే ఉన్న డివైడర్ని ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. రోడ్డు మధ్యలో వాహనం పడిపోవటంత వల్ల కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాన్ని తొలగించి పోలీసులు ట్రాఫిక్ని పునరుద్ధరించారు.
ఇదీ చూడండి:అక్కకు అసభ్య సందేశాలు.. చివరికి కటకటాలు