ఐపీఎల్ క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి, వీయ్యంబంజార, పాత కారాయి గూడెం, అడవిమల్లెల, చింతగూడేనికి చెందిన 23 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్ తెలిపారు. ఈ నెల 22న పాత కారాయి గూడెం చెందిన శ్రీకాంత్, ఈ నెల 24న చింతగూడెంలో మల్లాది బిక్షాలు, టేకులపల్లిలో వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు... 23 మంది అరెస్ట్ - ipl bettings in khammam
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని గ్రామాల్లో ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడుతున్న 23 మంది ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 21 చరవాణులు, సుమారు రూ.55 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారించగా... బెట్టింగ్‌లకు పాల్పడుతున్న మిగతవారి పేర్లు బయటపెట్టినట్లు తెలిపారు. టేకులపల్లిలో 9 మంది, చింతగూడెంలో ఐదుగురు, పాతకారాయి గూడెం చెందిన ఇద్దరు, అడవిమల్లెల చెందిన ముగ్గురు, వీఎం బంజర్‌కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 సెల్ఫోన్లు, రూ 54,540 ను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.
యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ సూచించారు. ఈ కేసులో బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్న ఎస్సై నాగరాజు, ఏఎస్సై మన్మధరావు, కానిస్టేబుళ్లను ఏసీపీ అభినందించారు.