ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి నేపథ్యంలో ఆ దేశంపై మరిన్ని ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం. తమ సైనిక స్థావరాల మీద జరిగిన దాడిపై స్పందిస్తూ మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై తక్షణమే అదనపు ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ తన ప్రవర్తన మార్చుకునే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించారు.
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు మరింత కఠినం! - ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు
ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాక్‌లోని తమ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్.
ఇరాన్ అమెరికా
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా.. ఇరాన్ బుధవారం.. క్షిపణులను ప్రయోగించింది. ఇరాక్‌లోని బాగ్దాద్ విమానాశ్రయంలో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసీం సులేమనీని అమెరికా డ్రోన్ దాడితో చెంపేసింది. ఇందుకు ప్రతికార చర్యగా ఇరాన్ బుధవారం క్షిపణులతో అగ్రరాజ్య సైనిక స్థావరాలపై దాడి చేసింది.
ఇదీ చూడండి:ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై రాకెట్లతో దాడి