తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు

ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడి జరిగిందని ఇరాక్​, అమెరికా భద్రత దళాలు ప్రకటించాయి. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

By

Published : Feb 14, 2020, 1:23 AM IST

Updated : Mar 1, 2020, 6:53 AM IST

Rocket attack
ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు

ఇరాక్​ కిర్​కుక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై గురువారం రాత్రి క్షిపణి దాడులు జరిగినట్లు ప్రకటన విడుదల చేశాయి ఇరుదేశాల భద్రతా దళాలు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

2019 డిసెంబరు 27 నాటి దాడుల అనంతరం అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు జరగడం ఇదే తొలిసారి . అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మృతికి కారణమైన నాటి ఘటన కతెబ్ హిజ్బుల్లా ఉగ్ర సంస్థ నిర్వహించిందేనని ఆరోపించింది అమెరికా.

దీనికి ప్రతిగా 25 మంది కతెబ్ హిజ్బుల్లా ఉగ్రవాదులను కాల్చిచంపింది అగ్రరాజ్యం. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే ఇరాన్​ ముఖ్య సైనికాధికారి ఖాసీం సులేమానిని మట్టుబెట్టింది.

ఇదీ చూడండి:‘కరోనా’ అనుమానితుడిని కాల్చి చంపిన ఉత్తరకొరియా

Last Updated : Mar 1, 2020, 6:53 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details