ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారంఘన విజయం సాధించారు. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ నెతన్యాహు విజయకేతనం ఎగురవేశారు. అయితే ఏడాది లోపు ఇజ్రాయెల్‌లో మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రాజకీయ సంక్షోభం కారణంగా ఏప్రిల్, సెప్టెంబర్లలో జరిగిన ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా మళ్లీ నెతన్యాహు
ఇజ్రాయెల్‌లో జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు ఘన విజయం సాధించారు. ఈ గెలుపును అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశానికి పెద్ద విజయంగా అభివర్ణించారు.
ఇజ్రాయెల్‌లో మళ్లీ పగ్గాలు చేపట్టనున్న నెతన్యాహు
ఇజ్రాయెల్‌కు చెందిన మూడు మీడియా సంస్థలు చేసిన సర్వేలో నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ లికుద్ పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. లికుద్ పనితీరును మెచ్చి ప్రజలు ఇప్పుడు ఎన్నుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విజయాన్ని అందించినందుకు నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. దేశానికి అతిపెద్ద విజయంగా అభివర్ణించారు.