టర్కీలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 73కు చేరింది. శుక్రవారం నాటికి 69 మంది మృతి చెందగా.. తాజాగా మరికొందరు మరణించినట్లు టర్కీ అత్యవసర, విపత్తు నిర్వహణ అథారిటీ(ఏఎఫ్ఏడీ) వెల్లడించింది.
"తాజా గణాంకాల ప్రకారం భూకంప ప్రమాదంలో 73 మంది మరణించారు, మొత్తం 961 మంది గాయపడ్డారు."
-ఏఎఫ్ఏడీ
భూకంపం వల్ల 40కి పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమవడం లేదా తీవ్రంగా దెబ్బతినడం గానీ జరిగిందని టర్కీ పర్యావరణ, పట్టణీకరణ శాఖ మంత్రి మూరట్ కురుమ్ తెలిపారు. వెయ్యికి పైగా భవనాలు పాక్షికంగా ధ్వంసమైనట్లు చెప్పారు.
గత శుక్రవారం ఏజియన్ సముద్రంలో సంభవించిన భూప్రకంపనల కారణంగా టర్కీలో సునామీ సంభవించింది. ప్రధాన నగరాల్లో ఒకటైన ఇజ్మిర్ పట్టణంలో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి-యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి