కరోనా నుంచి కోలుకున్నవారికి మరోసారి మహమ్మారి ముప్పు లేదనడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. కరోనా నుంచి బయటపడ్డవారికి కొన్నిచోట్ల ఇమ్యూనిటీ పాస్‌పోర్ట్‌లు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్స్ ఇవ్వడంపై ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా నిర్ణయాలతో వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొంది.
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,00,000కు పైగా ప్రాణాలను బలిగొంది. 29 లక్షల మంది వరకు సోకింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది డబ్ల్యూహెచ్‌ఓ.