తెలంగాణ

telangana

ETV Bharat / international

'కొవిడ్‌ చికిత్సలో ఇవర్‌మెక్టిన్‌ వద్దు'

కొవిడ్‌ చికిత్సలో ఇవర్‌మెక్టిన్‌ ఔషధాన్ని వినియోగించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ డా. సౌమ్య స్వామినాథన్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఇవర్‌మెక్టిన్‌తో కొవిడ్ దరిచేరదని వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ సిఫార్సులు చేయడం గమనార్హం.

By

Published : May 11, 2021, 3:53 PM IST

no ivermectin in covid treatment
కొవిడ్ చికిత్సలో ఇవర్​మెక్టిన్ వద్దు

కరోనా చికిత్సలో ఇవర్​మెక్టిన్​ ఔషధాన్ని వినియోగించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది. ఈ ఔషధం వల్ల కరోనా సోకినవారికి ఆసుపత్రి అవసరం రాదని, కొవిడ్‌ మరణాలు తగ్గుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

"వ్యాధి చికిత్సలో ఏదైనా కొత్త ఔషధాన్ని చేర్చేప్పుడు దాని భద్రత, సమర్థత చాలా ముఖ్యం. కొవిడ్‌ చికిత్సలో (క్లినికల్‌ ట్రయల్స్‌ మినహా) ఇవర్‌మెక్టిన్‌ను ఉపయోగించొద్దని డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేసింది."

-- డా. సౌమ్య స్వామినాథన్‌, డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌

'కచ్చితమైన ఆధారాలు లేవు'

ఇవర్‌మెక్టిన్‌ నోటి ద్వారా తీసుకునే ఔషధం. కాగా.. దీనిపై డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేయడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఔషధం వల్ల కరోనా సోకినవారికి ఆసుపత్రి అవసరం రాదని, కొవిడ్‌ మరణాలు తగ్గుతాయని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవని ఈ ఏడాది మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కొవిడ్‌ చికిత్సలో ఈ ఔషధం వినియోగం వద్దని తాజాగా మరోసారి సూచించింది. అయితే ఇవర్‌మెక్టిన్‌తో కొవిడ్ దరిచేరదని వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ సిఫార్సులు చేయడం గమనార్హం.

ఇదీ చదవండి :ఆదర్శ మహిళ- 3వేల కొవిడ్​ శవాలకు అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details