తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రధాని విదేశీ పర్యటనపై దర్యాప్తు షురూ.!

బ్రిటన్​ ప్రధానిపై దర్యాప్తు మొదలైంది. ఇటీవల ఆయన సెలవులపై కరీబియన్​ దీవుల్లో పర్యటించారు. అందుకు సంబంధించిన ఖర్చు వివరాలను తెలపాలని ఆ దేశ నిఘా సంస్థ ఆయనపై విచారణ చేపట్టింది.

UK PM Johnson faces probe over luxury holiday
ప్రధాని విదేశీ పర్యటనపై దర్యాప్తు షురూ.!

By

Published : Mar 8, 2020, 10:49 PM IST

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ విదేశీ పర్యటనపై దర్యాప్తు ముమ్మరం చేసింది ఆ దేశ పార్లమెంటరీ నిఘా సంస్థ. ఆయన ఇటీవలే కరీబియన్​లో పర్యటించగా.. సంబంధిత ఖర్చు వివరాలను ఆరా తీస్తోంది. ఈ మేరకు.. హౌస్​ ఆఫ్​ కామన్స్​లో నియమ నిబంధనల పార్లమెంటరీ కమిషనర్​ కాథ్రిన్​ స్టోన్​ విచారణ ప్రారంభించారు.

ఏం జరిగింది?

జాన్సన్​తో పాటు ఆయన కాబోయే భార్య కేరీ సైమండ్స్​.. నూతన ఏడాది వేడుకల కోసం మస్టిక్యు దీవులను సందర్శించారు. కానీ ఈ పర్యటనకైన ఖర్చు... 15వేల పౌండ్లను(భారత కరెన్సీలో సుమారు రూ.14.4 లక్షలు) తన కన్సర్వేటివ్​ పార్టీకి విరాళాలిచ్చే వ్యాపారవేత్త డేవిడ్​ రాస్ ప్రదానం చేశారని తెలిపారు బోరిస్​.

అసలు చిక్కు అక్కడే మొదలైంది. బోరిస్​ వ్యాఖ్యలను రాస్​ తొలుత ఖండించారు. కానీ చివరికి ఆ విరాళాన్ని 'ఓ రకమైన ప్రయోజనం'గా పేర్కొన్నారు. ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని విపక్ష లేబర్​ పార్టీ కమిషనర్‌ను కోరింది. అయితే ఈ విషయంపై బోరిస్​ కార్యాలయం స్పందించడానికి నిరాకరించింది.

ఇదీ చదవండి:ప్రపంచ దేశాలపై కరోనా పంజా.. 3,595 మంది బలి!

ABOUT THE AUTHOR

...view details