తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ పార్కులో హత్యలు ఉగ్రవాదుల పనే!

బ్రిటన్​లోని ఓ​ పార్కులో విచక్షణా రహితంగా కత్తిపోట్లకు తెగబడ్డవారు ఉగ్రవాదులేనని స్పష్టం చేశారు పోలీసులు. ప్రస్తుతానికి రీడింగ్​ నగర వాసులు బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్​ మృతి ఘటనకు, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

By

Published : Jun 21, 2020, 7:17 PM IST

UK park stabbings that killed 3 declared terrorist attack
ఆ పార్కులో అమాయకులను పొడిచి చంపింది టెర్రరిస్టులే!

ఇంగ్లాండ్ రీడింగ్​ నగరంలోని ఓ పార్కులోకి చొరబడి ముగ్గురు అమాయకులను అత్యంత దారుణంగా పొడిచి చంపింది, అనేక మందిని తీవ్రంగా గాయపరిచింది ఉగ్రవాదులేనని తేలింది. ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు, థేమ్స్​ వ్యాలీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం బయటపడింది.

ఉగ్రవాద నిరోధక విభాగం దర్యాప్తు

ఉగ్ర కలకలం..

రద్దీగా, ప్రశాంతంగా ఉన్న రీడింగ్​ పార్క్​లో ఉగ్రవాదుల కత్తుల దాడి ఒక్కసారిగా కలకలం రేపింది. భయాందోళనకు గురైన ప్రజలు గట్టిగా అరుస్తూ పరుగులు పెట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రజలను ఇళ్లల్లోకి పంపారు. ఘటనా స్థలంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ 25 ఏళ్ల యువకుడిని అరెస్ట్​ చేశారు.

పార్కులో పోలీసుల విచారణ

ఉత్తర ఆఫ్రికా లిబియాకు చెందిన ఆ యువకుడిని విచారించగా ఇది ఉగ్ర కుట్ర అని తేలింది. అమెరికాలో జార్జ్​ ఫ్లాయిడ్ ఘటనకు వ్యతిరేకంగా సాగుతున్న 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్​' నిరసనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పోలీసులు. దీంతో.. రీడింగ్ నగరానికి ఉగ్రవాద ముప్పుందని గ్రహించి ప్రజలను బయటకు రావద్దని హెచ్చరించారు.

సంఘటనా స్థలంలో పోలీసు వాహనాలు, అంబులెన్సులు

ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​, హోం మంత్రి ప్రీతి పటేల్, ఆరోగ్య మంత్రి మ్యాట్​ హ్యంకాక్ స్పందించారు. బాధిత కుటుంబాలకు తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పోలీసుల స్పందించిన తీరును ప్రశంసించారు. ఘటనా స్థలానికి దక్షిణ మధ్య అంబులెన్స్​ సేవలు, ఐదు ప్రత్యేక వైద్య బృందాలు, ఓ హెలికాప్టర్​ను పంపించినట్లు వెల్లడించింది ఆ దేశ ఆరోగ్య శాఖ.

పార్కులో ఆధారాల సేకరణ
రంగంలోకి అత్యవసర స్పందన దళం

ఇదీ చదవండి:పార్టీలో ఫైరింగ్​- 9 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details