తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2020, 7:44 PM IST

Updated : Mar 1, 2020, 1:25 PM IST

ETV Bharat / international

బ్రిటన్​లో 'డెన్నిస్' తుపాను బీభత్సం

బ్రిటన్​లో డెన్నిస్​ తుపాను భయాందోళనలకు గురిచేస్తోంది. విపరీతమైన గాలులు, భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. ఫలితంగా జనజీవనం స్తంభించిపోయింది. అధికారులు ప్రమాద హెచ్చరికలను జారీచేస్తూ.. తమను తాము రక్షించుకోవాలని ప్రజల్ని కోరారు.

UK issues rare 'danger to life' warning over Storm Dennis
బ్రిటన్​లో 'డెన్నిస్' తుపాను బీభత్సం

బ్రిటన్​లో 'డెన్నిస్​' తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పలు పట్టణాలు, నగరాల్లో భీకర గాలులతో వర్షాలు కురిశాయి. ఫలితంగా.. వేల్స్​, స్కాట్లాండ్​లలో అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ప్రాణాంతక వరదల బారినుంచి తమను తాము రక్షించుకోవాలని ప్రజల్ని కోరారు.

సుమారుగా 250పైగా వరద ముప్పులు పొంచి ఉన్నాయని బ్రిటన్ వాతావరణ సేవా కార్యాలయం హెచ్చరించింది.

బ్రిటన్​లో 'డెన్నిస్' తుపాను బీభత్సం

భారీ వర్షం.. భీకర గాలులు

ఒక్కరోజు వ్యవధిలోనే ఆగ్నేయ వేల్స్​లో సుమారుగా 105మిల్లీ మీటర్ల(4.1 అంగుళాలు) భారీ వర్షం కురిసింది. హరికేన్​ ప్రాంతంలో గంటకు 91 మైళ్ల(146 కిలోమీటర్లు) వేగంతో భీకర గాలులు వీచాయి. ఫలితంగా వందలాది విమాన, రైలు సర్వీసులు రద్దయ్యాయి. వేలమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలకు కూడా మధ్యంతర సెలవులు ప్రకటించారు.

రక్షణ చర్యలను ముమ్మరం చేసిన బ్రిటిష్​ ప్రభుత్వం.. ఆర్మీ సిబ్బంది, రిజర్విస్ట్​లను రంగంలోకి దింపింది.

ఇదీ చదవండి:ఆసియా దాటిన కరోనా... ఫ్రాన్స్​లో తొలి మరణం

Last Updated : Mar 1, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details