చిన్నపిల్లలకు సరైన నిద్ర లేకపోతే వారిలో కుంగుబాటు, ఆందోళన, ఆలోచన లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని తాజాగా ఓ నివేదిక తెలిపింది. తగినంత నిద్ర లోపిస్తే చిన్నారుల్లో నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
సరైన నిద్ర మెదడులోని నరాల అనుసంధానానికి తోడ్పడుతుందని, పిల్లలకు ఇది చాలా ముఖ్యమైనదని పరిశోధకులు వెల్లడించారు. ఫలితంగా మెదడు వేగంగా పని చేస్తుందని చెబుతున్నారు. బ్రిటన్లో జరిపిన ఈ అధ్యయనంలో భాగంగా 9 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న 11వేల మంది పిల్లల మెదడు పనితీరును పరిశీలించారు శాస్త్రవేత్తలు.