తెలంగాణ

telangana

By

Published : Apr 27, 2021, 11:44 AM IST

ETV Bharat / international

భారత్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది: టెడ్రోస్‌

భారత్​లో కరోనా పరిస్థితిని చూస్తుంటే హృదయవిదారక స్థితిని మించిపోయినట్లు అనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు సాయం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపింది.

WHO chief, Tedros Adhanom
టెడ్రస్‌

భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చూస్తుంటే హృదయ విదారక స్థితిని మించిపోయినట్లు అనిపిస్తోందని వెల్లడించింది. భారత్‌కు సాయం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్​ సోమవారం విలేకరులతో మాట్లాడారు.

"భారత్‌లో ప్రస్తుత పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వీలైనంత మేరకు శాయశక్తులా కృషి చేస్తోంది. వైద్య సామగ్రి, వేలాదిగా ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ల్యాబోరేటరీ పరికరాలు అందిస్తోంది. అంతేకాకుండా భారత్‌కు సిబ్బంది సహకారం అందించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే ముందడుగు వేసింది. అందులో భాగంగా 2,600 మంది వైద్య నిపుణుల్ని డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే భారత్‌కు బదిలీ చేస్తూ ప్రకటించినట్లు"

- టెడ్రోస్ అథనోమ్​, డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్న 3.52లక్షల కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 2,812 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:మాస్కు ధరించలేదని ప్రధానికి జరిమానా!

ABOUT THE AUTHOR

...view details