తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్ రాజకుటుంబంలో సంక్షోభం.. కెనడాకు మేఘన్! - Prince Harry's wife Meghan back in Canada amid royal storm

బ్రిటన్ రాజకుటుంబంలో తలెత్తిన సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా పావులు కదుపుతున్నారు రాణి ఎలిజబెత్, యువరాజు చార్లెస్. అయితే చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రిన్స్ హారీ సతీమణి మేఘన్ మెర్కల్ కెనడాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో రాజకుటుంబీకులు సహా ప్రధాని బోరిస్ జాన్సన్ జోక్యం చేసుకుని సంక్షోభం నుంచి బకింగ్​హామ్​ పాలెస్​ను గట్టెక్కించాలని రాజవంశీకులు యోచిస్తున్నట్లు సమాచారం.

britain
బ్రిటన్ రాజకుటుంబంలో సంక్షోభం-కెనడాకు మేఘన్

By

Published : Jan 10, 2020, 5:52 PM IST

బ్రిటన్ రాజవంశీకుల హోదా నుంచి వైదొలగుతామని గురువారం ప్రకటించారు ప్రిన్స్ హారీ- మేఘన్ మెర్కెల్ దంపతులు. ఈ నేపథ్యంలో మేఘన్ స్వస్థలమైన కెనడాకు చేరుకున్నారని ఆమె అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. రాజకుటుంబంలో తలెత్తిన సమస్యకు పరిష్కారం దిశగా రాణి ఎలిజబెత్​, యువరాజు చార్లెస్​ పావులు కదుపుతున్న తరుణంలో మెర్కెల్​ కెనడా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది . అయితే ప్రిన్స్ హారీ... కుటుంబీకులతో కలిసి చర్చించేందుకు బ్రిటన్​లోనే ఉండిపోయారు.

రాజవంశీకుల హోదా నుంచి వైదొలగుతామని ప్రకటించేందుకు ముందు రాణి ఎలిజబెత్​, కుటుంబీకులతో ప్రిన్స్ హారి చర్చించలేదని సమచారం. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని రాజకుటుంబం యోచిస్తోంది. పరిష్కారం కోసం ప్రిన్స్ హారి.. కుటుంబీకులతో చర్చించాలని.. రాణి ఎలిజబెత్, యువరాజు చార్లెస్ ఆయన కుమారుడు ప్రిన్స్ విలియమ్స్​ యోచిస్తున్నారు. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ జోక్యం చేసుకోవాలని భావిస్తున్నారు.

రాజకుటుంబంలో డ్యూక్, డచెస్​గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న హారీ, మేఘన్​ మెర్కెల్..​ కుటుంబ పెద్దలకు తెలియకుండానే తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ రాజప్రాసాదంలో గందరగోళం నెలకొంది.

ఇదీ జరిగింది..

సీనియర్ రాజవంశీకుల హోదా నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు గురువారం ప్రకటించారు ప్రిన్స్ హారీ- మేఘన్ మెర్కెల్ దంపతులు. ఉత్తర అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడపాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. హ్యారీ ప్రకటనపై బకింగ్​హామ్ ప్యాలెస్​ స్పందించింది. ఇది క్లిష్టమైన నిర్ణయమని బ్రిటన్ రాణి ఎలిజబెత్​-2 భావిస్తున్నట్టు తెలిపింది.

ఇదీ జరిగింది: మహారాజులా కాదు.. స్వతంత్రంగా జీవిస్తాం: ప్రిన్స్​ హ్యారీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details