బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మెర్కెల్.. సీనియర్ రాజవంశీకుల హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఉత్తర అమెరికాకు వెళ్లి ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడపాలని వారిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
"సీనియర్ రాజవంశీకుల హోదా నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాం. బ్రిటన్ రాణికి మా మద్దతు కొనసాగిస్తూనే ఆర్థికంగా స్వతంత్ర జీవనం గడపాలని కోరుకుంటున్నాం. కొన్ని నెలల పాటు అంతర్గతంగా చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాము."
- ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మెర్కెల్
హ్యారీ ప్రకటనపై బకింగ్‌హామ్ ప్యాలెస్ స్పందించింది. ఇది క్లిష్టమైన నిర్ణయమని బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భావిస్తున్నట్టు తెలిపింది.
"భిన్నంగా జీవించాలన్న వారి కోరికను మేం అర్థం చేసుకున్నాం. కానీ.. ఇది చాలా క్లిష్టమైన సమస్య. ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కాస్త సమయం పడుతుంది."
-ఎలిజబెత్ రాణి అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: ఇరాన్ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి..?