తెలంగాణ

telangana

ETV Bharat / international

స్థిరంగానే కరోనా కేసులు: డబ్ల్యూహెచ్​ఓ - కరోనా

కరోనాకు సంబంధించిన కేసులు స్థిరంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత నాలుగు రోజులుగా కేసుల సంఖ్య అంతగా పెరగలేదని తెలిపింది. కరోనా రోగులకు చికిత్సకు ఆటంకం ఎదురవుతోందన్న వార్తలను ఖండించింది. మరోవైపు ప్రాంతాల పేరుతో వైరస్​లను పిలవకుండా డబ్ల్యూహెచ్​ఓ జాగ్రత్త పడుతోంది.

Novel coronavirus case numbers 'stabilising': WHO
గుడ్​ న్యూస్-స్థిరంగానే కరోనా కేసులు: డబ్ల్యూహెచ్​ఓ

By

Published : Feb 9, 2020, 5:45 AM IST

Updated : Feb 29, 2020, 5:16 PM IST

కరోనా వైరస్​కు సంబంధించి చైనాలో రోజూవారిగా నమోదవుతున్న కేసులు సంఖ్య స్థిరంగానే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) స్పష్టం చేసింది. ఇది మంచి వార్తే అయినప్పటికీ.. వైరస్ ప్రభావం అత్యున్నత స్థాయికి చేరిందని ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపింది.

"హుబే నగరంలో నమోదవుతున్న కేసుల సంఖ్య స్థిరంగా ఉంది. నాలుగు రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య అంతగా పెరగలేదు. ఈ మంచి వార్త... నియంత్రణ చర్యల ఫలితమే కావచ్చు. కానీ దీనిపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం తొందరపాటే అవుతుంది.''

-మైఖేల్ ర్యాన్, డబ్ల్యూహెచ్​ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ అధ్యక్షుడు

ట్రోల్స్​ పైనా పోరాటం

చైనాలో వైరస్​ సోకిన వ్యక్తులకు చికిత్స చేయడానికి ఆటంకాలు ఎదురవుతున్నాయన్న వార్తలను ఖండించారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్. చైనాకు పంపనున్న అంతర్జాతీయ నిపుణుల బృందానికి సంబంధించి అక్కడి అధికారులతో చర్చించినట్లు తెలిపారు.

"మేము వైరస్​తో మాత్రమే పోరాడటం లేదు. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి మేం చేసే చర్యలను తక్కువ చేస్తూ... తప్పుడు వార్తలను ప్రచారం చేసే ట్రోల్స్​, కుట్రలపైనా పోరాడుతున్నాం."

-టెడ్రోస్ అధనామ్ గెబ్రెయెసస్, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్

పేరుపై రగడ!

నగరాలు, ప్రాంతాల పేర్లతో వైరస్​లను పిలవకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్త పడుతోంది. తాజా సంచలనం అయిన కరోనా వైరస్​ను తాత్కాలికంగా '2019-ఎన్​సీఓవీ అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్​'గా నామకరణం చేస్తూ ఇదివరకే ప్రకటించింది. అయితే వైరస్​ పేరుకు సంబంధించి తుది నిర్ణయం మరికొద్ది రోజుల్లో డబ్ల్యూహెచ్​ఓ ప్రకటించనుంది. డబ్ల్యూహెచ్​ఓ, అంతర్జాతీయ వైరస్​ వర్గీకరణ కమిటీ కలిసి సంయుక్తంగా వైరస్​ పేరుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నాయి.

"ఎలాంటి ప్రాంతాల పేర్లతో సంబంధం లేకుండా మధ్యంతర పేరును ప్రకటించడం చాలా ముఖ్యమని మేం అనుకుంటున్నాం. ఇప్పటికే చాలా వార్తా సంస్థలు ఈ వైరస్​ను వుహాన్​ లేదా చైనాగా పిలుస్తున్నాయి. అందుకే ఏ నగరానికి అప్రతిష్టలు రాకుండా చూడాలనుకుంటున్నాం."

-మారియా వాన్ కెర్కోవ్​, డబ్ల్యూహెచ్​ఓ ఎమర్జింగ్ డిసీజ్ యూనిట్ హెడ్

2015లో వెలువరించిన డబ్ల్యూహెచ్​ఓ మార్గనిర్దేశకాల ప్రకారం వ్యాధులకు ప్రాంతాల పేర్లు పెట్టడం నిషేధం. ఎబోలా, జికా వంటి ప్రాంతాల పేర్లతో పాటు, ఓ వర్గాన్ని ప్రతిబింబించే 'స్పానిష్ ఫ్లూ' వంటి పేర్లనూ ఉపయోగించకూడదని ఈ మార్గనిర్దేశకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: బొమ్మల దిగుమతిపై సుంకాల పెంపు.. ఉపాధికి గండి!

Last Updated : Feb 29, 2020, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details