తెలంగాణ

telangana

ETV Bharat / international

గొడ్డలితో రెచ్చిపోయిన ఉన్మాది- 8మందికి గాయాలు

స్వీడన్​లో ఓ ఉన్మాది గొడ్డలితో రెచ్చిపోయాడు. ఈ దాడిలో 8 మంది గాయపడ్డారు. పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనను స్వీడర్​ ప్రధాని ఖండించారు.

By

Published : Mar 4, 2021, 3:29 AM IST

Man injures 8 with axe in Sweden before being shot, arrested
గొడ్డలితో రెచ్చిపోయిన ఉన్మాది- 8మందికి గాయాలు

స్వీడన్‌లోని వెట్లాండ పట్టణంలో ఓ ఆగంతుకుడు జరిపిన గొడ్డలి దాడిలో 8 మంది గాయపడ్డారు. అతడిపై పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. ఈ దాడి వెనక ఉగ్రకోణం ఉందా అనే అంశంపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి ఉద్దేశం తెలియదని స్వీడన్‌ పోలీసులు తెలిపారు.

బుధవారం జరిగిన ఈ ఘటనను స్వీడన్‌ ప్రధాని స్టీఫన్‌ లోఫ్‌వెన్‌ ఖండించారు. దాడి నేపథ్యంలో ఘటన జరిగిన ప్రాంతంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: నిరసనకారులపై పోలీసుల కాల్పులు- 33 మంది మృతి!

ABOUT THE AUTHOR

...view details