ఇటలీలో కరోనా మృత్యుఘోష తీవ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 969 మంది మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 9,134కి చేరింది. కరోనా కారణంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో ఇంతమంది చనిపోయిన ఘటనలు లేవు. ఇటలీలో మొత్తం కేసుల సంఖ్య 86,500కు చేరింది.
ఐరోపా విలవిల