ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే - good friday
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు భక్తి ప్రపత్తులతో గుడ్‌ఫ్రైడేను నిర్వహించారు. క్యాథలిక్ నగరం వాటికన్ సిటీలో పోప్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
'క్రీస్తు త్యాగాలు మరపురానివి'
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. క్యాథలిక్ నగరం వాటికన్ సిటీ వీధులు జనసంద్రమయ్యాయి. ప్రత్యేక ప్రార్థనల ప్రారంభానికి ముందు ఏసు త్యాగాలను గుర్తు చేసుకుంటూ సాగిలపడి నమస్కారం చేశారు పోప్. రోమ్‌లోని కొలోజియం వరకు ఊరేగింపు నిర్వహించారు.