బెల్జియమ్ రాజధాని బ్రెసెల్స్‌లోని రాయల్ మ్యూజియమ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చారిత్రక పెయింటింగ్‌లకు నెలవు. ఒక్కసారి గ్రాండ్రూమ్లో ప్రవేశిస్తే 15వ శతాబ్దం నాటి ప్రముఖ చిత్రకారుల కళాఖండాలు మిమ్మల్ని ఆబ్బురపరుస్తాయి. ఇందులో ప్రధానంగా ప్రఖ్యాతి చిత్రకారుడు పీటర్ బ్రూగెల్ 1562లో రూపొందించిన 'ది ఫాల్ ఆఫ్ ద రెబల్ ఏంజల్స్' పెయింటింగ్ ఈ తరానికి దర్శనమిస్తోంది. వాటిని చూస్తే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ కుదరని పని. ఇదంతా నిన్నటివరకు.
ఇప్పుడు మీకు నచ్చిన పెయింటింగ్స్‌ను మీ లివింగ్ రూమ్‌లో దర్జాగా పెట్టుకొని చూడచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ ఇందుకు కృషి చేస్తోంది. మ్యూజియంతో జరిగిన ఒప్పందంలో భాగంగా 22 ప్రముఖ చిత్రపటాలు టీవీలో పొందుపరిచారు. ఆర్ట్స్ స్టోర్ ఐచ్ఛికం ద్వారా వాటిని వీక్షించవచ్చు.
"టీవీలో వీక్షించడానికి సబ్స్క్రిప్షన్ పద్దతిలో పెయింటింగ్స్ అందుబాటులో ఉంటాయి. నెలకు ఐదు యూరోలు చెల్లిస్తే పరిమితం లేకుండా అన్ని చిత్రాలను చూడొచ్చు. దాదాపు 12వందల ప్రఖ్యాత కళాచిత్రాలు టీవీలో పొందుపరిచి ఉంటాయి. ఇంకో ఐచ్ఛికంలో ఒక్కో చిత్రానికి ప్రత్యేకంగా చెల్లించవచ్చు. ఇందుకు 20 యూరోలు ఖర్చవుతుంది."
-జాన్ వాన్, సామ్సంగ్ లైఫ్‌స్టైల్ ప్రాజెక్ట్ మేనేజర్.
సామ్సంగ్ ఇంతకుముందే ఇలాంటి కార్యక్రమాలు ఇతర దేశాల్లో చేపట్టింది. లండన్ టేట్ గ్యాలరీ, ప్లోరెన్స్లోని ఉఫ్పీజీ మ్యూజియం, ఆమ్స్టర్డామ్ వాన్ గోఘ్ మ్యూజియంలలో సాంకేతికను జోడించింది.