తెలంగాణ

telangana

By

Published : Mar 22, 2019, 7:56 AM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్ ఆలస్యానికి షరతులతో ఈయూ అంగీకారం

బ్రెగ్జిట్​ గడువును స్వల్పకాలంపాటు పొడిగించడానికి ఐరోపా సమాఖ్య​ అంగీకరించింది. అయితే ఇందుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరని షరతు విధించింది.

బ్రెగ్జిట్ గడువు పొడిగింపునకు ఈయూ అంగీకారం

బ్రెగ్జిట్ గడువు పొడిగింపునకు ఈయూ అంగీకారం

బ్రిటన్ బ్రెగ్జిట్​ గడువును స్వల్పకాలంపాటు పొడిగించడానికి ఐరోపా సమాఖ్య​ అంగీకరించింది. యూకే పార్లమెంట్​ ఆమోదం తెలిపితేనే మే 22 వరకు బ్రెగ్జిట్​ గడువు పొడిగిస్తామని షరతు విధించింది. ఒకవేళ ప్రధాని థెరిసా మే ప్రతిపాదనను బ్రిటన్​ చట్టసభ్యులు తిరస్కరిస్తే బ్రెగ్జిట్ గడువు ఏప్రిల్​ 12తోనే ముగియనుంది.

బ్రస్సెల్స్​లో జరిగిన ఈయూ సదస్సులో బ్రిగ్జిట్​ విషయంపై అనిశ్చితి నెలకొంది. అయితే బ్రిగ్జిట్​ గడువు పొడిగింపు ప్రతిపాదనకు ప్రధాని థెరిసా మే అంగీకరించారని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డొనాల్డ్​ టస్క్ తెలిపారు.

ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్ వైదొలగడానికి ఉద్దేశించింది బ్రెగ్జిట్​. ఇందుకు ముందుగా నిర్దేశించుకున్న గడువు మార్చి 31. ఈలోగా ఐరోపా సమాఖ్యతో బ్రిటన్​ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా... రాజకీయ ఏకాభిప్రాయం లేక సాధ్యపడలేదు.


ABOUT THE AUTHOR

...view details