తెలంగాణ

telangana

ETV Bharat / international

రేపే బ్రెగ్జిట్​ : బ్రిటన్​కు​ యూరోపియన్​ పార్లమెంట్​​ వీడ్కోలు

ఈ నెల 31న ఐరోపా సమాఖ్య​ నుంచి బ్రిటన్​ వైదొలిగే బ్రెగ్జిట్ ఒప్పందానికి యూరోపియన్​ యూనియన్ పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. దాదాపు 50 ఏళ్లపాటు ఈయూలో సభ్యదేశంగా కొనసాగిన బ్రిటన్​ ఇక నుంచి స్వతంత్రంగా ఉండనుంది. భావోద్వేగాల నడుమ 621-49 ఓట్ల తేడాతో చట్టసభసభ్యులు బ్రెగ్జిట్​కు అంగీకారం తెలిపారు.

Euro MPs set seal on Brexit in emotional vote
రేపే బ్రెగ్జిట్​ : బ్రిటన్​కు​ యూరోపియన్​ పార్లమెంట్​​ వీడ్కోలు

By

Published : Jan 30, 2020, 6:12 AM IST

Updated : Feb 28, 2020, 11:38 AM IST

బ్రిటన్ చరిత్రలో కీలక ఘట్టమైన బ్రెగ్జిట్​కు​ మార్గం మరింత సుగమమైంది. మరో 24 గంటల్లో (జనవరి 31) ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలగనున్న నేపథ్యంలో బ్రెగ్జిట్​ ఒప్పందానికి తాజాగా యూరోపియన్​ పార్లమెంట్​ ఆమోదముద్ర వేసింది. బ్రిటన్​తో ఈయూకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చట్టసభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం 621-49 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్​కు అంగీకారం తెలిపారు. 'ఆల్డ్​ లాంగ్​ సైన్'​ అనే సంప్రదాయ పాటతో బ్రిటన్​కు వీడ్కోలు పలుకుతూ.. దాదాపు 50 ఏళ్లపాటు సాగిన తమ స్నేహాన్ని స్మరించుకున్నారు. బ్రెగ్జిట్​ ఒప్పందానికి క్వీన్ ఎలిజబెత్​-2 ఇదివరకే అధికారిక ముద్ర వేయగా ప్రధాని బోరిస్​ జాన్సన్​ కూడా సంతకం చేశారు.

పంతం నెగ్గించుకున్న బోరిస్

మాజీ ప్రధాని థెరెసా మే... 2018లో బ్రెగ్జిట్​ ఒప్పందంపై చర్చలు జరిపారు. దిగువసభ ఈ విషయాన్ని మూడుసార్లు తిరస్కరించింది. ఫలితంగా.. థెరెసా రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బోరిస్​... బ్రెగ్జిట్​ను సాకారం చేసేందుకు చాలా కృషి చేశారు. మెజారిటీ లేకపోవడం వల్ల ఎన్నికలకు వెళ్లారు. జాన్సన్​ అధిక మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఎంపీలు ఈ ఒప్పందానికి మద్దతు పలికారు.

బ్రెగ్జిట్ తరువాతేంటి?

ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలిగిన తరువాత ఏం చేయాలనే దానిపై బ్రిటన్​ ప్రధాని బోరిస్​ ఫిబ్రవరి ప్రారంభంలో ఓ విధాన నిర్ణయం తీసుకునే అవకాశముంది

Last Updated : Feb 28, 2020, 11:38 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details