ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌కి తగినట్టుగా కొవిడ్ టీకాల సరఫరా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ధనిక దేశాలు తమ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోకపోవడం వల్ల టీకా ఉత్పత్తి, సరఫరాలో జాప్యం ఏర్పడుతోంది.
బంగ్లాదేశ్‌లోని ఓ పెద్ద నగర శివారులో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఓ కర్మాగారాన్ని స్థాపించారు. అయితే.. అందులోని కొన్ని గదులను పూర్తిగా కప్పేసి ఉంచారు. ప్రస్తుతం ఆ కర్మాగారంలో నాలుగింట ఒకవంతు వద్ద మాత్రమే పనులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోనే కాకుండా ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా మరో మూడు కర్మగారాలు ఉన్నాయని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ తన పరిశోధనలో తెలిపింది. కానీ, వాటిలో ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రక్రియ జరగటం లేదు. టీకా తయారీకి సంబంధించిన బ్లూ ప్రింట్, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే.. తక్కువ సమయంలో లక్షలాది టీకాలను తాము ఉత్పత్తి చేయగలమని వాటి యజమానులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:టీకా పంపిణీపై జీ7 దేశాల హామీ
10దేశాల్లోనే..80శాతం టీకాలు..
టీకా తయారీలో బ్రిటన్ సహా.. ఐరోపా సమాఖ్య, అమెరికా దేశాలకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీలైన ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాల వద్ద ఉన్న సాంకేతికతను పంచుకోవాల్సిందిగా పలు దేశాలు కోరుతున్నాయి. అయితే ఆయా కంపెనీల స్పందన మాత్రం అంతంతమాత్రంగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో అధికం ధనిక దేశాలకే అందుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటివరకు దాదాపు 80 శాతం వ్యాక్సిన్లు కేవలం 10 దేశాల్లోనే పంపిణీ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక తెలిపింది. మరోవైపు 210 దేశాల్లోని 250 కోట్ల మంది జనాభాకు ఒక్క డోసూ అందలేదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:'టీకాలు కొనే ముందు ధనిక దేశాలు ఆలోచించాలి'
టీకా ధరలపైనా..