ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 11,33,373 మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. 60,375 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,35,992 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో నిత్యం వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.
అమెరికాలో..
అమెరికాలో కరోనా వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 2,77,533 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 7,403 మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి బాధితుల్లో 12, 283 మంది కోలుకున్నారు. అంతకంతకూ పెరిగిపోతున్న రోగులకు చికిత్స చేయడానికి.. అమెరికా ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది అవస్థలు పడుతున్నారు.
ఐరోపా దేశాలు కుదేలు..